Saturday, 26 September 2026 08:05:47 PM

సీపీఐ తిరుపతి స్మారక భవన నిర్మాణానికి చేయూతను ఇవ్వండి.

ప్రజలకు సీపీఐ నాయకుల విజ్ఞప్తి

Date : 28 November 2022 01:20 PM Views : 673

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పార్టీ ప్రజాసంఘాల నిర్మాణం కోసం విశేషంగా కృషి చేసిన సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ పార్టీ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకొని పేద ప్రజలకు అనేక సేవలందించిన మర్కపురి తిరుపతి(సీపీఐ తిరుపతి) స్మారక భవన నిర్మాణం స్ధానిక లాల్ బహదూర్ నగర్ లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నామని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గొషిక మోహన్, జిల్లా మాజీ కార్యదర్శి గౌతం గోవర్ధన్, నగర కార్యదర్శి కే కనక రాజ్ లు తెలిపారు.సోమవారం స్థానిక లాల్ బహదూర్ నగర్ లోని సీపీఐ జెండా వద్ద భవన నిర్మాణ కరపత్రాలను విడుదల చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ సీపీఐ తిరుపతి స్మారక భవన నిర్మాణం ప్రజా ఉద్యమ కేంద్రంగా ఉంటూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో నాయకులు పనిచేస్తారని అన్నారు. భవన నిర్మాణానికి ఆర్థికంగా చేయూతను ఇవ్వాలని వారు కోరారు. ఎల్ బి నగర్ 32వ డివిజన్ కార్యదర్శి మార్కపురి సూర్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి తాళ్ళపెల్లి మల్లయ్య,సీపీఐ ప్రజాసంఘాల నాయకులు బొడకుంట్ల కనకయ్య,ఏర్రల రాజయ్య, మడికొండ ఓదెమ్మ, జైపాల్ రెడ్డి,సుధీర్,దాసరి రామస్వామి, లక్ష్మీ పతి, గోగు మహేందర్, బయ్యపు రాజిరెడ్డి,బోల్ల లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు .

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :