Tuesday, 11 August 2026 02:52:06 PM

ఎంఫార్మసీ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులు..

Date : 25 March 2025 06:01 PM Views : 476

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఫార్మసీ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఫార్మసీ (పీసీఐ) మెయిన్, బ్యాక్‌లాగ్ పరీక్షల ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. విద్యార్థులు తమ మార్కు మెమోలను సంబంధిత కళాశాలల నుంచి మూడు వారాల తర్వాత పొందవచ్చని చెప్పారు.ఈ రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈ నెల 29వ తేదీలోగా టీఎస్ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ. 200 అపరాధ రుసుముతో వచ్చే నెల 2వ‌ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పరీక్ష జవాబు పత్రాల నకలు పొందేందుకు ఒక్కో పేపర్‌కు రూ.1000 చొప్పున చెల్లించి ఈనెల 29వ తేదీ వరకు తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్‌సైట్లో చూసుకోవచ్చని సూచించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :