Sunday, 27 September 2026 08:21:17 AM

రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయి...

నేను చెప్పినవి తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా... ఎమ్మెల్సీ కవిత

Date : 03 January 2025 05:46 PM Views : 750

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయనేది నిజం కాదా అని నేను చెప్పినవి తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన వాక్యాలు చేసారు. ఈ సందర్బంగా హైద‌రాబాద్ ఇందిరా పార్క్ వ‌ద్ద నిర్వ‌హించిన బీసీ మ‌హాస‌భ‌కు హాజరై మాట్లాడుతూ...జనగణనలో భాగంగా కులగణన చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేసారు.కర్నాటక, బిహార్ వంటి విఫలయత్నాల అనుభవాలు ఉన్నా కూడా తొలుత డేడికేటెడ్ కమిషన్ వేయాల్సింది అని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ఉద్యమం చేయడం, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు రేవంత్ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేయలేదన్నారు.బీసీల లెక్కలు ఒక కమిషన్ తీస్తుంటే... మరో కమిషన్ నివేదిక ఇస్తుందన్నారు.ఇలా చేస్తే కోర్టుల్లో నిలబడుతుందా అని ప్రశ్నించారు. బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నావంటూ కాంగ్రెస్ నాయకులు నన్ను ప్రశ్నిస్తున్నారని...సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా అని స్పష్టం చేసారు. తర్వాత ఎన్నికలు పూర్తయ్యాక ఎందుకు మాట్లాడలేదని మళ్లీ కాంగ్రెస్ నాయకులే అంటారని తెలిపారు.ఎటువంటి లోటు పాట్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే అని డిమాండ్ చేసారు.లేదంటే బీసీల జనాభా ఎంత ఉంటే అంత వాటా ఇచ్చి ఎన్నికల్లోకి వెళ్లాలని డిమాండ్ చేసారు.దొంగ లెక్కలు, కాకిలెక్కలు కాకుండా వాస్తవ లెక్కలు తీయాలని మన ఉద్యమాల వల్లే సావిత్రీబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.మన ఉద్యమాలతో జంగుపట్టిన ప్రభుత్వ రథచక్రాలు కదులుతున్నాయని బీసీలకు మంచి రోజులు వస్తాయన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :