Tuesday, 11 August 2026 06:49:53 PM

గోదావరిఖనిలో ముడుపుల రాజాతో కుమ్మక్కు..⁉️

పెద్దపల్లి జిల్లాలోనే కీలకంగా మారిన రేషన్ మాఫియా సూత్రధారుడు...ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం...ప్రతి నెల కొంత మంది అధికారులకు భారీగా ముడుపులు...⁉️

Date : 17 November 2023 12:33 PM Views : 1177

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అతనో సామాన్య వ్యక్తి... ఒక్కప్పుడు ఇతర రాష్ట్రం నుండి గోదావరిఖనికి వచ్చి అడ్డగుట్టపల్లిలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేసేవాడు. ఆ సమయంలోనే ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం అక్రమ వ్యాపారాలకు దారి తీసింది.. కరోనా కాలంలో అందరూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే... సదురు రేషన్ బియ్యం మాఫియా సూత్రధారుడికి మాత్రం కరోనా కలిసొచ్చిందనే ప్రచారం జరుగుతుంది.మొదట చిన్న చిన్నగా 5 కిలోల చొప్పున కొనడం ప్రారంభించిన రేషన్ మాఫియా సూత్రధారి ప్రస్తుత పరిస్థితుల్లో 5 వేల క్వింటాళ్లు కొనే స్థాయికి చేరాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కేంద్రంగా నడుస్తున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాలో సదురు వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే చదువు రేషన్ మాఫియా బియ్యం సూత్రధారుడు కొంతమంది తనకున్న పరిచయాలను అడ్డం పెట్టుకొని ఇటు కొంత మంది అధికారులకు, అటు సంబంధించిన శాఖలకు చెందిన కొంత మందికి నెల నెల మామూళ్లు ముట్ట చెబుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎవరైనా అక్రమ దందాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని చెప్పే అధికారులకు రేషన్ మాఫియా సూత్రధారుడు కనిపించడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రతి నెల కొంత మంది అధికారులకు అమ్యా అమ్యాలను క్రమం తప్పకుండా పంపిస్తున్నట్లు జోరుగా విమర్శలు వినిపిస్తున్నాయి. గోదావరిఖని నుండి ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున రేషన్ బియ్యం సరఫరా చేస్తూ లక్షల రూపాయలను ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూరుస్తున్న సంబంధిత వ్యక్తి పై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సదరు అక్రమ బియ్యం వ్యాపారికి ఒక ఇద్దరు చొక్కా ధరించి నాయకుడు మద్దతిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో ప్రస్తుత అధికార పార్టీకి విద్యార్థి సంఘం నాయకుడిగా పని చేసి, ప్రస్తుతం ఓ దిన పత్రికకు రిపోర్టర్ గా చెప్పుకుంటున్న సదురు వ్యక్తి ఈ బియ్యం వ్యాపారికి పూర్తి స్థాయిలో మద్దతిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రామగుండం కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడితే సదురు వ్యక్తి బాగోతాలతో పాటు కొంత మంది అధికారుల అవినీతి చిట్టా కూడా బయటపడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే....

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :