Friday, 25 September 2026 05:17:09 PM

సోషల్ వర్క్ కోర్సు ను ఆర్ట్స్ కళాశాలకు తరలించాలి..

ఏ. బి. వి. పి ఆధ్వర్యంలో వి. సి మరియు రిజిస్ట్రార్ కు వినతి

Date : 15 March 2025 06:46 PM Views : 645

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల యందు 2004 నుంచి నడుపుతున్న మాస్టర్ అఫ్ సోషల్ వర్క్ కోర్స్ ను యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల, మెయిన్ క్యాంపస్ తార్నాక కు మార్చాలని అఖిల భారతీయ విద్యార్థి సంఘం (ఏబీవీపీ) ఆధ్వర్యంలో వైస్ ఛాన్సెలర్ ప్రో. యం. కుమార్ గారికీ మరియు ప్రో. నరేష్ రెడ్డి రిజిస్టార్ గారికీ వినతిపత్రం సమర్పించడం జరిగింది. సోషల్ కోర్స్ ప్రారంభం నుంచి పి. జి. కళాశాల లో ఉండటం నేటికీ దాదాపు ఇరవై ఏండ్లు గా సెల్ఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గా ఉండటం వలన తగిన గుర్తింపు, గౌరవం, అదునాతన లైబ్రరీ, అకాడమిక్స్లో సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . కానుక తక్షణమే మాస్టర్ అఫ్ సోషల్ వర్క్ (సంఘ సంక్షేమ శాస్త్రం) కోర్సు బదిలీ చేస్తూ, బడ్జెట్ కోర్సు మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి. జీవన్, అలివేలు రాజు, ధ్రువన్ పృథ్వి బాలకృష్ణ, కదం పాండు రంగా,తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :