Thursday, 24 September 2026 08:52:52 PM

బీఆర్ఎస్ పార్టీలో చేరిన టిడిపి నేత రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి

Date : 20 October 2023 05:16 PM Views : 551

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : వ‌న‌ప‌ర్తి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భ‌వ‌న్‌లో రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి నిరంజ‌న్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జ‌గ‌న్నాథంతో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు.రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి టీడీపీ త‌ర‌పున 1994, 2009 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌న‌ప‌ర్తి నియోక‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో ఏపీ ప్ర‌భుత్వ విప్‌గా ప‌ని చేశారు. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కూడా ఎన్నిక‌య్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఇక్క‌డి టీడీపీ ముఖ్య నాయ‌కులు వివిధ పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. రావుల మాత్రం టీడీపీలోనే కొన‌సాగుతున్నారు. చంద్ర‌బాబు ఆయ‌న‌ను పొలిట్‌బ్యూరో స‌భ్యుడిగా కూడా నియ‌మించారు. వ‌న‌ప‌ర్తి జిల్లాలో రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి మంచి ప‌ట్టుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :