Friday, 25 September 2026 09:53:40 PM

మాజీ కాంట్రాక్ట్ కార్మికులు విన్నుత నిరసన

ప్రధానమంత్రి కి నల్ల జెండాలతో నిరసన.

Date : 12 November 2022 12:13 PM Views : 792

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ RFCL ను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో భాగంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వస్తున్న సందర్భంగా FCI మాజీ కాంటాక్ట్ కార్మికులకు జరిగిన అన్యాయాన్ని నివసిస్తూ కార్మిక కుటుంబాలు నల్లజెండాలు పట్టి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.మాజీ కాంట్రాక్ట్ కార్మికులకు జరిగిన అన్యాయాన్ని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని గత FCI స్థానంలో ఏర్పడ్డ RFCL లో మోసపోయిన దగాపడ్డ కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అన్యాయంమని వారు అవేధన వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. మోడీ ప్రభుత్వం పోలీసుల ద్వారా కాంట్రాక్ట్ కార్మికులను అరెస్టులు చేసినప్పటికీ మాజీ కాంట్రాక్టు కార్మికులంతా తమ ఇండ్లలోనే ఉండి కుటుంబాలతో సహా నల్ల జెండాలు పెట్టి రోజంతా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందినీ పేర్కొన్నారు. ఇది చూసి అయిన మోడీ ప్రభుత్వం సిగ్గుపడాలని విమర్శించారు. నిర్బంధం నీడలో నిరసన చేపట్టిన మాజీ కాంట్రాక్టు కార్మికుల ఆవేదనను మోడీ ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం గత FCI మాజీ కాంట్రాక్టు కార్మికులకు RFCL లో ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో RFCL, IFTU ప్రధాన కార్యదర్శి తోకల రమేష్, అధ్యక్షులు ఇనుగాల రాజేశ్వర్, నాయకులు డి శంకర్, యు సురేష్, కే శంకర్, మెతుకు వెంకటేశం, మొగిలి, శ్రీనివాస్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :