ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : కేటీఆర్ దావోస్ వెళ్లి పెట్టుబడులు తీసుకువస్తే దండగా అన్నారని.. ఉత్తమ్ కుమార్‌రెడ్డి అక్కడికి వెళ్లడం వేస్ట్ అన్నారని.. మరి ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి సైతం దావోస్ వెళ్లారని.. దానిపై ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల కృతజ్ఞత సభ గురువారం జరిగింది. కార్యక్రమానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు పని చేశాయన్నారు. కులాలు, మతాలు చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారన్నారు. అయినా కూడా ఎంతో అద్భుతంగా పని చేసి కేసీఆర్ గెలుపు కోసం కృషి చేశారన్నారు.
Admin
Aakanksha News