Saturday, 26 September 2026 07:18:29 PM

మహశివరాత్రి మహ జాగరణోత్సవం

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

Date : 15 February 2023 03:09 PM Views : 504

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 18వ తేదీ సాయంత్రం విజయమ్మ పౌండేషన్ రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మహా శివరాత్రి మహ జాగరణోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంలో మహా శివరాత్రి మహా జాగరణ ఉత్సవం పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల్లో మరింత భక్తిభావాన్ని పెంచేందించేందుకు మహా శివరాత్రి మహా జాతర ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం లాగానే ఎంతో ఘనంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. గత నాలుగు సంవత్సరాల కాలంగా మహాశివరాత్రి రోజున జాగరణ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలందరూ మహా శివరాత్రి పండుగ రోజున భక్తిరస సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తానిపర్తి గోపాల్ రావు అమరేందర్ అందె సదానందం దామెర శంకర్ రవి తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :