ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఉపాధి కోసం ఓ మహిళా పాల వ్యాపారం కోసం చిన్నపాటి పాల బూత్ ను ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం దానిని కూల్చివేసి అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెట్రోల్ డబ్బా పట్టుకొని జీహెచ్ఎంసీ వాహనాల ముందు బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఉప్పల్ - చిలక నగర్ డివిజన్ కళ్యాణపురి పార్క్ దగ్గర గత 20 సంవత్సరాల నుండి నడుపుతున్న పాల బూత్ ను నడుపుకుంటూ సదురు మహిళా తన కుటుంబాన్ని పోషించుకుంటుంది. అయితే దీనిని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. అన్యాయంగా షాపు కూల్చేసి తన పొట్ట కొట్టారని, తనకు న్యాయం చేయాలని పెట్రోల్ డబ్బా పట్టుకొని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
Admin
Aakanksha News