Friday, 25 September 2026 06:10:03 PM

విద్యార్థిడిని చితకబాదిన ఉపాధ్యాయురాలు...

పాఠశాలపై చర్యలు తీసుకోవాలని తల్లి దండ్రుల ఆందోళన

Date : 31 January 2025 10:59 AM Views : 622

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జోగులంబ గద్వాల జిల్లా : గద్వాల జిల్లా అయిజా పట్టణంలోని శ్రీ కృష్ణవేణి స్కూల్ లో రెండవ తరగతి చదువుతున్న విద్యార్ధిడిపై ఓ ఉపాధ్యాయురాలు క్రూరంగా ప్రవర్తించారు. ఒంటిపై వాతలు వచ్చేలా తన ప్రతాపాన్ని చూపించాడు. వివరాల్లోకి వెళ్తే.. గట్టులో నివాసం ఉండే జ్యోతి, కృష్ణానాయక్‌ దంపతుల ఇద్దరు కుమారులు విరాట్‌ శంకర్‌ నాయక్‌, మోక్షిత్‌ నాయక్‌ ఇద్దరు కూడా శ్రీ కృష్ణవేణి స్కూల్ లో విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే విరాట్‌ శంకర్‌ నాయక్‌ ను తరగతి ఉపాధ్యాయురాలు కట్టెతో చితకబాదడంతో వీపుపై గాయమైంది. ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల వద్ద విద్యార్థి బోరున విలపించాడు. జరిగిన విషయాన్నీ వారికి తెలపడంతో పాఠశాల తీరుపై విద్యార్ధి తల్లి తండ్రులు ఉపాధ్యాయురాలు ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. సదురు పాఠశాలపై MEO, DEO చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :