Friday, 25 September 2026 04:57:25 PM

ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం

Date : 04 October 2022 12:46 PM Views : 467

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ త్రిపాఠీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు.పండంటి బాబుకు జన్మానించారు. అయితే సోమవారం రాత్రి పురిటీ నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకవేల్లి అడ్మిట్ చేశారు. దీంతో ఆస్పత్రి సూపరిండెంట్ సంజీవయ్య ఆధ్వర్యంలో సాధారణ డెలివరీ కోసం ప్రయత్నం చేయగా శిశువు బరువు ఎక్కువగా ఉండటంతో సాధారణ డెలివరీ సాధ్యం కాకా పోవడంతో ఆపరేషన్ చేసి వైద్యులు డెలివరీ చేశారు. దీంతో ప్రభుత్వాసుపత్రిలో డెలివరీ చేయించి జిల్లా ప్రజలకు కలెక్టర్ దంపతులు ఆదర్శంగా నిలిచారు. దీంతో కలెక్టర్ అంటే ఇలా ఉండాలంటూ ప్రశంసల జల్లు కురుస్తోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :