ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : హైదరాబాద్ రవీంద్ర భారతిలో గత రెండు రోజులుగా జరుగుతున్న ఆల్ ఇండియా మేజిక్ కన్వెన్షన్ 'మాయాజాలం-2022' కు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి 14మంది ఇంద్రజాలికులు హాజరయ్యారు.వారిలో స్థానిక ఇంద్రజాలికులు మేజిక్ రాజా, మేజిక్ హరి, మేజిక్ అలాడిన్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష, ప్రధాకార్యదర్శులు మల్లేశం, యతిరాజ్ కాస, బండి శంకర్, దీకొండ సత్యం, గుర్రం శ్రీనివాస్, వంశీ, కేఎన్ చారి, మాస్టర్ వివేకానంద, కాంతారావు, బ్రహ్మం, మహేష్ తదితరులు హాజరయ్యారు. కాగా, స్థానిక ప్రముఖ ఇంద్రజాలికులు మేజిక్ రాజా మాస్టర్ సెరెమనీ సభ్యులుగా ఉండగా, బండి శంకర్, మల్లేశం ప్రదర్శించిన ప్రాచీన ఇంద్రజాలం 'కాటిపాపలు' విశేషంగా అలరించింది. మెజీషియన్ వంశీని సూపర్ సీనియర్ గా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, కన్వెన్షన్ నిర్వాహకులు మర్రి రమేష్ తదితరులు ఘనంగా సన్మానించారు.
Admin
Aakanksha News