ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎల్,బీ నగర్ లోని ఇండో అమెరికన్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న మేకల పునీత్ అనే విద్యార్థిడిని పరీక్ష సరిగ్గా రాయలేదని ఓ టీచర్ కర్రతో కొట్టడంతో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ఈ విషయాన్ని పునీతు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వెంటనే విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులతో కలిసి పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. తమ కొడుకుని కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టిన తీరుపై పాఠశాల యాజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కళ్యాణ్ నగర్ లోని వర్షిని ప్రైమరీ పాఠశాలలో యూకేజీ చదువుతున్న ఆదర్వ్ బాబు పక్కనే ఉండి మరొకరితో క్లాస్ రూమ్ లో ఆడుకుంటున్న సమయంలో తమ దగ్గర ఉన్న పిన్ను కింద పడడంతో ఒకరినొకరు తీసుకుంటున్న క్రమంలో గమనించిన టీచర్ తన చేతిలో ఉన్న పెన్నుతో బాలుడి తలపైన కొట్టడంతో విద్యార్థికి తల పైన గాయమైంది. ఈ విషయంపై బాలుడి తండ్రి లిఖిత పూర్వకంగా గోదావరిఖని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ తో పాటు మండల విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. అయితే పారిశ్రామిక ప్రాంతంలోని పాఠశాలలో జరిగిన సంఘటనలు ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో స్పందించిన విద్యాశాఖ అధికారులు వర్షిణి ప్రైమరీ పాఠశాల తో పాటు ఇండో అమెరికన్ పాఠశాల యాజమాన్యానికి విద్యాశాఖ అధికారులు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. మూడు రోజుల్లోపు పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని లేఖలో హెచ్చరించారు.
Admin
Aakanksha News