Saturday, 26 September 2026 11:34:06 PM

టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

Date : 01 May 2023 05:14 PM Views : 1007

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : నూతన సచివాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.మార్గమధ్యలో టెలిఫోన్ భవన్ దగ్గర రేవంత్ ను ఆపేశారు.దీంతో రేవంత్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.ఔటర్ రింగ్ కాంట్రాక్టు అంశంలో భారీ అక్రమాలు జరిగాయని.. దీనిపై మున్సిపల్, హెచ్ఎండీఏ అధికారులను కలిసి సమాచార హక్కు కింద దరఖాస్తు చేసేందుకు సెక్రటేరియెట్ కు వెళ్తున్నానని,తనను ఎందుకు అడ్డుకుంటున్నారని రేవంత్ ప్రశ్నించారు.తనను వెళ్లనివ్వకపోతే.. రోడ్డుపైనే కూర్చుంటానన్నారు.తాను ఒక ఎంపీగా సెక్రటేరియట్ కు వెళితే పోలీసులకు అభ్యంతరమేంటని రేవంత్ నిలదీశారు.సమాచార హక్కు చట్టం కింద వివరాలు తెలుసుకోవడానికి వెళ్తుంటే అడ్డుకొని దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు.ఔటర్ రింగురోడ్డులో జరిగిన అవినీతి బయటపడుతుందనే భయంతోనే ప్రభుత్వం తనను పోలీసుల ద్వారా అడ్డుకుంటుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :