ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని అధికారులకు సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వసతిగృహాల్లో తరచూ ఘటనలు చోటుచేసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. బాధ్యులైన వారిపై వేటు వేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందజేయాలని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, పుకార్లతో భయాందోళనలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
Admin
Aakanksha News