ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ : టిఆర్ఎస్ కార్యాలయంలో జరిగే టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం సందర్భంగా జూబ్లీహిల్స్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు రాష్ట్రాల నేతలు ప్రజాప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు.ఎన్టీఆర్ భవన్ అపోలో ఆసుపత్రి ఫిలింనగర్ నుండి వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36, 45 మీదుగా మళ్ళించారు అలాగే మోసబ్ ట్యాంక్ రోడ్ నెంబర్ 12 నుండి వచ్చే వాహనాలను రోడ్ నెంబర్ 1, 10 మీదుగా జహీర్ నగర్ నుంచి ఎన్టీఆర్ భవన్ మీదుగా మళ్ళించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం3 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని వాహనదారులు ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని సిపి రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Admin
Aakanksha News