ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లాలో పేరుకే పెద్ద కార్పోరేషన్ మన రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ కానీ దానిలోని అన్ని శాఖలలో అవినీతి అగ్రభాగాన రాజ్యమేలుతుందని ప్రతి పనిలో కమిషన్లు, కక్కుర్తిపడే వారు, లంచాలు తీసుకునే వారు కాంట్రాక్టర్ల పర్సెంటీజీల కోసం ఆశపడే ప్రజా ప్రతినిధులు, కొంతమంది అవినీతి అధికారుల బాగోతాలు ఇంతింత కాదని సిపిఐ నాయకులు మద్దెల దినేష్ అరోపించారు.అనంతరం అయన మాట్లాడుతూ.. లేని వాహనాలను ఉన్నట్లు వాటిని కోనుగోళ్లు చేసినట్లు ఏకంగా బిల్లులు చేల్లించి, లక్షల రూపాయాలు దండుకోని చేతులు దులుపుకుంటుడడం విడ్డురంగా ఉందన్నారు. రామగుండం కార్పోరేషన్ లో పట్టణ ప్రగతి నిధులు 24.26 లక్షలతో ఎక్స్ వేటర్, అలాగే జెట్టింగ్ మిషన్ కోనుగోలు చేసినట్లు జూన్ 2021లో 1.34 కోట్ల చెల్లింపులు చేసినట్లు రికార్డులలో ఉందన్నారు.కానీ అ వాహనాలు మాత్రం ఇప్పటికి కార్పొరేషన్ కు చేరలేదని ప్రధానంగా శానిటేషన్ విభాగంలో వాహనాల కొనుగోళ్ళ విషయంలో కోట్లాది రుపాయాల కుంభకోణం జరిగిందని వారు ఆరోపించారు. అలాగే పారిశుద్ద్య విభాగం లోని చెత్త సేకరణ కోసం రకరకాల వాహనాలను కోనుగోలు చేసిన అధికారులు ఏకంగా వాటికి ఉన్న రేటు కన్న 30 నుంచి 40 శాతం వరకు అధిక ధరలతో కోనుగోలు చేసుకోవడం గమనార్హం అని అన్నారు. అలాగే చాలా వరకు వాహనాలు మూలనపడ్డాయని, మరోవైపు లక్షలాది రూపాయాలతో కోనుగోలు చేసిన భారీ వాహనాలకు రిపేర్లు, విడి భాగాలు అందుబాటులో లేక మూలన పడి, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పడుతున్నాయని అన్నారు. అయితే వాటి పేర్లతో కూడా రిపైర్లు చెపిస్తున్నామని వాటికి పెట్రోల్ డీజిల్ పోయిస్తున్నామని టైర్లు మారుస్తున్నామని బిల్లులు దోబ్బిన ఘనత మన పారిశుద్ద్య విభాగం ఓ అధికారి అవినీతి లీలలు కొనసాగాయని విమర్శించారు. 45 లక్షల వ్యయంతో సీవరేజ్ జెట్టింగ్ మిషన్, 23.49 లక్షలు వెచ్చించి, స్వీపింగ్ మిషన్ రిపేర్లు లేక కార్పోరేషన్ కార్యాలయంలోని ఆవరణలో గాలికి వదిలేశారని లేని వాహనాలను కోనుగోలు చేసినట్లు సృష్టించడం, మరోవైపు కొన్న వాహనాలకు ఎక్కవ ధరలను చెల్లించడం అలాగే రిపేర్ల పేరిట 70 నుంచి 80 లక్షల వరకు చేతులు మారినట్లు ఆరోపించారు.ఇలా గత కొంత కాలం నుంచి ఎలాంటి రికార్డులు లేకుండానే సుమారు 7 కోట్ల వరకు బిల్లులు చెల్లించడం ఏంటి అని ఎవడి అబ్బా సొత్తు అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనం కాకుండా ఇదంతా వారి జేబులో నుంచి సొంతంగా ఖర్చు పెడితే తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ లబ్ది పోందుతు విలసవంతంగా తిరుగుతున్నారని విమర్శించారు.లక్షలాది రుపాయాలు దుర్వినియోగం అవుతున్నప్పటికి అధికారులకు మరోవైపు కమీషన్లకు కక్కుర్తి పడే నేతలకు ఎలాంటి చలనం లేదని ఆగ్రహాం వ్యక్తం చేస్తూ విజిలెన్స్ విచారణ పారదర్శకంగా చేసి ప్రజాధనాన్నీ కాపాడలని వారు ప్రభుత్వాన్ని మద్దెల దినేష్ డిమాండ్ చేశారు.
Admin
Aakanksha News