ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : ఆగస్టు 30లోగా బీసీ డిగ్రీ గురుకుల కళాశాలలో ప్రవేశాల కొరకు దరఖాస్తులు చేసుకోవాలని డిగ్రీ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ ఏ. స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం మహాత్మ జ్యోతి బాపూలే బీసీ సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలను పెద్దపల్లి జిల్లాలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. డిగ్రీ కళాశాలలో బీఏ(ఆర్థిక, రాజకీయ శాస్త్రం, చరిత్ర) , బీకాం కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ (గణితం, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్), బీఎస్సి (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ) కోర్సులలో ప్రవేశం ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు.బిసి గురుకుల కళాశాలలో ప్రవేశం కొరకు ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, గురుకుల కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు ఉచితంగా అందించడం జరుగుతుందని, ఆసక్తి గలవారు ఆగస్టు 30లోగా ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Admin
Aakanksha News