ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మంచిర్యాల జిల్లా : చెన్నూరు : టిఆర్ఎస్ పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరారు. అయితే కాంగ్రెస్ లో మున్నాళ్ల ముచ్చటగానే నల్లాల ఓదెలు జర్నీ మిగిలింది. ఈరోజు ప్రగతి భవన్ కి చేరుకున్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. తన సతీమణి మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి తో కలిసి టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే గులాబీ సైనికులు బిఆర్ఎస్ పార్టీ సంబరాల్లో ఉన్న నేపథ్యంలో పార్టీని వీడిన నాయకులు మళ్లీ పార్టీలో చేరుతుండడం శుభపరిణామంగా పలువురు భావిస్తున్నారు. మే 19వ తేదీన ఢిల్లీలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో నల్లాల ఓదెలు చేరారు. అయితే నాలుగు నెలలు గడవకముందే ఆయన మళ్లీ టిఆర్ఎస్ లో చేరడం చర్చనీయాంశంగా మారుతుంది.
Admin
Aakanksha News