Saturday, 18 January 2025 10:44:48 AM

కూతురిని నరికి చంపిన తండ్రి

పెద్దపల్లి జిల్లాలో సంచలనం

Date : 11 May 2023 12:21 PM Views : 844

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి జిల్లా : మంథనిలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురిని అతి కిరాతకంగా తండ్రి నరికి చంపిన ఘటన పెద్దపెల్లి జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... మంథని మండలం భట్టుపల్లి గ్రామంలో కన్న కూతురు రజిత (10)లు తండ్రి గుండ్ల సదయ్య గొడ్డలితో నరికి చంపాడు. అయితే గత కొంత కాలంగా సదయ్య మానసిక స్థితి సరిగా లేక గ్రామంలో జనాలపై తరచుగా దాడులు చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. కూతురును చంపిన తర్వాత అదే గ్రామానికి మరో వ్యక్తి దూపం శ్రీనివాస్ పై దాడి కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు