ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : ఫార్ములా ఈ రేసు కేసులో ఎసిబి విచారణకు మాజీ మంత్రి కెటిఆర్ హాజరయ్యారు. గురువారం ఉదయం తన లాయర్ రామచంద్రరావుతో కలిసి కెటిఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కేసులో కెటిఆర్ ను ఎసిబి అధికారులు 30 నుంచి 40 ప్రశ్నలు అడగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా విదేశాలకు నగదు బదిలీపై ఎసిబి ప్రశ్నించనున్నట్లు సమాచారం. నిన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ ను విచారించిన అధికారులు.. ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా విచారించనున్నారు.
Admin
Aakanksha News