Sunday, 27 September 2026 02:23:56 AM

సోనియా గాంధీ లేనిదే తెలంగాణ లేదు... టీపీసీసీ అధ్యక్షుడు,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అభివృద్ది ఏడాదిలో చేసి చూపించాం...

Date : 06 December 2024 05:23 PM Views : 628

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా సోనియా గాంధీ జన్మదినోత్సవ వేడుకలలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.శుక్రవారం గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోనియా గాంధీ లేనిదే తెలంగాణ లేదన్నారు. పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అభివృద్ది పనులను కాంగ్రెస్ ఏడాదిలో చేసి చూపించిందన్నారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది అధికారం కోల్పోయిన కేటీఆర్ అహంకార ధోరణి వీడలేదు కేటీఆర్ పగటి కలలు కంటున్నారు లక్షల కోట్లు దోపిడీ చేసిన మీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎలా అనుకుంటున్నారు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ కోసం కేటీఆర్, కవిత ఏం త్యాగం చేశారని రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు కేటీఆర్ దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదు దేశంలోనే తక్కువ సమయంలో ఎక్కువ దోచుకున్న కుటుంబం ఏదైనా ఉందంటే అది కేసిఆర్ కుటుంబం బిఆర్ఎస్ హయంలో స్వేచ్చ కొరవడింది సీఎం రేవంత్ హయంలో స్వేచ్ఛకు కొదువ లేదు కౌశిక్ రెడ్డి వాడిన భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది* చట్టం ఎవరికి చుట్టం కాదు పదేళ్ల నిరంకుశ పాలన కు తెలంగాణ ప్రజలు చరమ గీతం పాడి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు కేసిఆర్ ,కేటీఆర్ తప్ప బిఆర్ఎస్ పార్టీలో ఎవరుకూడ ఉండలేని పరిస్థితి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కి సరిగ్గా సరిపోయే పేరు కిస్మత్ రెడ్డి బీజేపీ పార్టీకి పేదల గురించి మాట్లాడే హక్కు లేదు ప్రతిపక్ష నాయకుడిని ఫాం హౌస్ లో బంధించి కేటీఆర్, హరీష్ పిల్ల చేష్టలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు లా అండ్ ఆర్డర్ డిస్ట్రబ్ చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.ఈ సమావేశం లో ఎంఎల్సి లు అమెర్ ఆలీఖాన్, బల్మురి వెంకట్ అధికార ప్రతినిధి లింగం యాదవ్, మీడియా ఇంచర్గే సమా రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :