Thursday, 25 June 2026 06:44:32 PM

ప్రజా సమస్యలపై ఉద్యమబాట...

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి

Date : 30 November 2024 07:43 PM Views : 367

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రజాసమస్యలపై ఛార్జ్ షీట్ రూపకల్పన చేసి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డిఅన్నారు.శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయం లో బిజెపి సంఘటన్ పర్వ్ వర్క్ షాప్ లో పాల్గొని ప్రసంగించారు.తెలంగాణ ప్రజలు ఎంతో ఆరాటపడి, పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదేండ్లు గత ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమయం అయ్యింది.కుటుంబ పాలనపోవాలని, కేసీఆర్ అవినీతి పోవాలని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే...వాళ్లు కూడా బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లోనే నడుస్తున్నారన్నారు.కేసీఆర్ ప్రభుత్వంలో చూసిన అహంకారం, నియంతృత్వం, అవినీతి, వైఫల్యాలను కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నాం.గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసీటు కూడా గెలిపించలేదు. అనేక నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రాలేదు.ప్రధాని నరేంద్రమోదీ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీని మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు నిచ్చారు.. తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం అండగా నిలబడుతోంది. జాతీయ రహదారులు, రైల్వేల అభివృద్ధి కోసం కేంద్రం అనేక సహకారాలు అందిస్తోంది.గ్రామపంచాయతీలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా గ్రామ పంచాయతీలకు నిధులివ్వడం లేదు.15thఫైనాన్స్ నిధులతోనే గ్రామపంచాయతీలకు నిధులు అందుతున్నాయి. చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.రానున్న రోజుల్లో ప్రజలను సంఘటితం చేసి ఉద్యమబాట పట్టాలని పార్టీ శ్రినులకు పిలుపు నిచ్చారు.. ఆ దిశలో పార్టీ కార్యక్రమాలు రూపకల్పన చేయాలన్నారు.. పోలింగ్ బూత్ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు కొత్త కమీటీలు రాబోతున్నాయి.భారతీయ జనతా పార్టీ....కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల లాగా కుటుంబం అధారంగా నడిచే పార్టీ కాదు. ప్రజాస్వామ్యబధ్దంగా పని చేసే పార్టీ.బూత్ స్థాయి నుండి మంచి నాయకత్వం రావాలి.. మంచి కమిటీలు ఏర్పాటు కావాలి.ఇటీవల రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పడు తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించారు.కేంద్రప్రభుత్వం తరఫున తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అన్ని రకాలుగా అండగా నిలబడుతామని మోదీ స్పష్టంగా చెప్పారని,.రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలన్నారు. ప్రధాని మోదీ గారి స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది.ఉద్యోగాలు ఇస్తమని రాష్ట్ర నిరుద్యోగులకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు… గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ లను ప్రాసెస్ చేసి తామే ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు. డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం చేసిన తర్వాత డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తమని హామీ ఇచ్చి సంవత్సరం గడిచినా అరకోరగా తప్పితే రుణమాఫీ పూర్తిచేయలేదు.వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పెన్షన్ ఇస్తామని చెప్పిర్రు..కానీ ఉన్న 2,000పెన్షన్ ని కూడా సకాలంలో ఇవ్వడం లేదు.ఏడాది గడిచినా ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డులు లేక రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై, అన్ని అంశాల మీద డిసెంబర్ 1న భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజల ముందు ఛార్జ్ షీట్ పెట్టబోతున్నామని తెలిపారు..జిల్లా, అసెంబ్లీ స్థాయిలో గ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు పెట్టాలి.రానున్న రోజుల్లో ఉద్యమాల పకల్పన చేయాలి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :