ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మహబూబ్‌నగర్ జిల్లా : విద్యా,ఉద్యోగ,ఉపాధి ఆర్థిక,రాజకీయ,పారిశ్రామిక రంగాలలో పెట్టుబడిదారుల పెత్తనం ఎక్కువై బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరగడం లేదని, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బీసీసేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు.భూత్పూర్ మండల తాహ సిల్దార్ కార్యాలయం ఆవరణలో అడిగితే వచ్చేది శూన్యం పోరాడితేనే రాజ్యాధికారం గోడ పత్రిక ఆవిష్కరించిన అనంతరం మీడియాతో కృష్ణ యాదవ్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలఉ నికిని కాపాడు కోవ టానికి బీసీలను వాడుకుంటున్న నాయకులు పాలనలో భాగస్వామ్యం కల్పించకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పార్టీని కాపాడిన నాయకులకు కాకుండా ఎన్నికల సమయంలో వలస వచ్చిన నాయకులకు సీట్లు కేటాయించి కష్టపడ్డ వారిని అణిచివేస్తున్నారని మండిపడ్డారు. 2014-- 2019 పార్లమెంటు ఎన్నికలకు ముందు వలస వచ్చిన అగ్రకుల నాయకులకు సీట్లు కేటాయించి బిజెపి పార్టీ బండారి శాంతి కుమారుకు అన్యాయం చేసిందని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నైనా ఆయనకు కు టికెట్ కేటాయించాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీ,పార్టీలు కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మహబూబ్ గర్ పార్లమెంటు సీటును బీసీల కేటాయించాలనిడిమాండ్ చేశారు. ఏనాడూ పాలమూరు ప్రజల సమస్యలను పట్టించుకోని వివిధ పార్టీల కు చెందిన వలస నాయకులు ఓట్ల కోసం దండయాత్ర చేస్తున్నారని స్థానికేతరులు బరిలో దిగితే డిపాజిట్ కూడా దక్కకుండా తగిన గుణపాఠం చెప్పడానికి పాలమూరు ప్రజలు బీసీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.ఈకార్యక్రమంలోబీసీసేన జిల్లా అధ్యక్షులు బాలస్వామి, వెల్కి చెర్ల మాజీ సర్పంచ్ నాగయ్య, గొడుగునర్సిములు, శివకుమార్, పర్వతాల్, రాజు,చెన్న కేశవులు, తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News