ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ శాసన సభకు మూడవ సభాపతిగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ ని బిసి రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ తమ కేంద్ర కమిటీ సభ్యులతో హైదరాబాదులోని ఆయన నివాసంలో ఘనంగా సత్కరించారు.. విద్య ఉద్యోగ పారిశ్రామిక రాజకీయ రంగాలలో పేద అట్టడుగు వర్గాలు ఎదుర్కుంటున్న పలు సవాళ్ళను ఈ సందర్భంగా దాసు సురేష్ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు..సామాజిక సమస్యల పరిష్కారాలకు అసెంబ్లీ సాక్షీభూతం అవ్వాలని, అసెంబ్లీ వేదికగా అట్టడుగు వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడానికి వెల్లువయ్యే చర్చలలో పూర్తిస్థాయిలో సహకరించవలసిందిగా స్పీకర్ ను దాసు సురేష్ విజ్ఞప్తి చేశారు..తదనంతరం దాసు సురేష్ మీడియా తో మాట్లాడుతూ మారుమూల ప్రాంతం ,కడు పేదరికం నుండి స్వశక్తితో రాజకీయంగా ఎదిగి నేడు తెలంగాణ సభాపతిగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు నియమితులవడం అట్టడుగు బలహీన వర్గాల నాయకత్వానికి స్ఫూర్తిదాయకమన్నారు.. పేదల సమస్యలు తెలిసిన వ్యక్తిగా, విద్య, రాజ్యాధికారం పై అవగాహన ఉన్న వ్యక్తిగా అసెంబ్లీలో చర్చకు వచ్చే అట్టడుగు బలహీన వర్గాల సమస్యల పట్ల స్పీకర్ సానుకూలంగా వ్యవహరించడంతోపాటు అట్టి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత కల్పిస్తారన్న సంపూర్ణ విశ్వాసం తమకున్నదని దాసు సురేష్ మీడియా తెలిపారు.. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారు పద్మావతి, మహిళా యువజన కన్వీనర్ స్రవంతి , పెండెం ఉపేందర్ ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News