Thursday, 24 September 2026 08:52:34 PM

దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం కాలేశ్వరం ప్రాజెక్టు

వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల

Date : 11 November 2022 09:30 PM Views : 515

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ప్రజాప్రస్థానం పాదయాత్రలో బాగంగా గోదావరిఖని నైట్ షెల్టర్ వద్ద వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామగుండం కు మోడీ రాకను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. అనంతరం వైయస్ షర్మిల మాట్లాడుతూ... ప్రభుత్వ పరంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని అన్నారు.నిరుద్యోగులకు ఉద్యోగలను కల్పించాలని పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అతి పెద్ద కుంభకోణం జరిగిందని ఈ అవినీతి పై కేంద్రం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.దేశానికి కాపాల కుక్కల ఉన్న మోడీకి ఇవేమీ పట్టవా అని ప్రశ్నించారు.మోడీకి ఎదురువెళ్లి మాట్లాడే దైర్యం కేసీఆర్ కు ఉందా అని అన్నారు.కేసీఆర్ రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి ని చెయ్యాలని అన్నారు. ప్రపంచంలో కట్టిన నాలుగేళ్లలో నీటిలో మునిగి పోయిన ఏకైక ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఏటీఎం లాగా వాడుకుంటున్న కేసీఆర్ కు ప్రాజెక్ట్ 3వ టి ఎం సి కి అనుమతి ఎవ్వరు ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ కేసీఆర్ జగిరా అని మండిపడ్డారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను చూడకుండా ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని,అవినీతి పై ప్రతిపక్షాలు ఎందుకు స్పందించడం లేదన్నారు. వై ఎస్ ఆర్ టి పి తో కలిసి రావాలని ప్రతిపక్షాలకు పిలుపునిస్తున్నామని షర్మిల అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చూసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. ఒక ప్రధాని వస్తే ఎదురు వెళ్లి స్వాగతం పలికి సమస్యలను తెలపాల్సిన ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఎక్కడ కెసిఆర్ అవినీతి బయటపడుతుందో అనే భయంతోనే ప్రధాని వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లడం లేదని ఆరోపించారు. గతంలో కాలేశ్వరం ప్రాజెక్టులో దేశంలోనే అతిపెద్ద కుంభకోణం జరిగిందని దీనిపై సీబీఐకి విచారణ జరపాలని ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఏప్పటికైనా కెసిఆర్ అవినీతి బయటపడక తప్పదని తెలంగాణ ప్రజలే ఛీ కొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఆరోపించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :