Monday, 10 August 2026 02:55:55 PM

చీకట్లో....చీకటి దందా...

గోదావరిఖనిలో జోరుగా బెల్టుషాపులు.. పట్టించుకోని అధికారులు

Date : 06 May 2023 11:20 AM Views : 2189

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : చీకట్లో చీకటి దందా జోరుగా సాగుతోంది. దర్జాగా బహిరంగంగా నిబంధనలకు విరుద్ధంగా బెల్టుషాపులు నడుస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడంలో విఫలం చెందారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంతో మంది కార్మికులు వివిధ రంగాల్లో పని చేస్తూ ఉంటారు. వారి అలసటను ఆసరాగా చేసుకుని కొందరు బెల్టుషాపు నిర్వాహకులు అందిన కాడికి దండుకుంటున్నారు. "కోడి కుయక..క్వాటర్ చుక్కలు" అన్న చందంగా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం తయారైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశ్రామిక ప్రాంతంలోని పవర్ హౌస్ కాలనీ, ఐబీ కాలనీ. గంగనగర్, హనుమాన్ నగర్, బస్టాండ్ కాలనీ, శారదా నగర్, కేసీఆర్ కాలనీ, సీబీసి కాలనీ, అడ్డగుంటపల్లితో పాటు తదితర ఏరియాలలో జోరుగా బెల్టుషాపులు నడుస్తున్న ఇప్పటి వరకు ఆధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం పట్ల ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు కొందరు నిర్వాహకులు ఉదయం 3 గంటల నుండి మద్యం షాపులు తెరిచే సమయం వరకు జోరుగా బెల్ట్ షాపులు కొనసాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అంతే కాకుండా కొందరు నిర్వాహకులు అధిక ధరలకు మద్యం అమ్ముతూ కొందరి అవసరాలను ఆసరాగా మద్యం బాబుల బ్యాంకు బుక్కులను సైతం తమ వద్ద పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు దృష్టి సారించక పోవడంతో బెల్టుషాపు నిర్వాహకుల ఆగడాలు రెచ్చిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. *బస్టాండ్ ప్రధాన రహదారిపై జోరుగా బెల్టుషాపు...?* గోదావరిఖని ఆర్టీసీ డిపో సమీపంలో ప్రధాన రహదారిపైనే బెల్ట్ షాపును ఏర్పాటు చేసి ఏ తీర్చగా అమ్మకాలు సాగిస్తున్న అధికారులకు కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉదయం ఆర్టీసీ డిపో నుండి బస్సులు వచ్చే సమయంతో పాటు ఇతరత్రా పనులకు వెళ్లే ఎంతోమందికి ఈ షాపు ఇబ్బందిగా మారుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత దర్జాగా రోడ్డుపై బెల్ట్ షాప్ నిర్వహించడం పట్ల అధికారులు తీర్పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రధాన రహదారిపై ఈ బెల్ట్ షాప్ నిర్వహించడంతో కొందరు వాహనదారులు రోడ్డుపైనే తమ వాహనాలను నిలిపివేసి స్థానిక బెల్ట్ షాపులో మద్యం సేవిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేస్తూ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :