ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో తెలంగాణ విద్యా కమిషన్ విస్తృతంగా పర్యటించనుంది. ఈ నెల 28 నుండి డిసెంబర్ 7 వరకు అన్ని జిల్లాలలో వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ విద్యా సంస్థలను తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో కమిషన్ సభ్యులు ప్రొ. విశ్వేశ్వర్, వెంకటేష్, జ్యోత్స్న ఈ పర్యటనలో పాల్గొంటారు. ఈ పర్యటన విజవంతం కావడానికి అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు కమిషన్ బృందానికి వారి పర్యటనకు అవసరమైన లాజిస్టిక్స్, భద్రతను అందించాలని సి.ఎస్ ఆదేశించారు.విద్యా వ్యవస్థలో నాణ్యమైన విద్యను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు, పలు ప్రతిపాధనలు రూపొందించడానికి ఈ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు.
Admin
Aakanksha News