ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి జిల్లా : ఎన్నికలవేళ కాంగ్రెస్ పార్టీలో కలవర మొదలవుతుందా... అంటే పవన్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు కీలక నేతలు వ్యవహరించిన తీరుతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తి బయట పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అగ్ర నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో పెద్దపెల్లి జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన నేపద్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది పదవుల్లో ఉన్న నాయకులకు రాహుల్ గాంధీ సభకు సంబంధించిన పాసులను జారీ చేశారు. అయితే ఈ పర్యటనలో పెద్దపల్లి జిల్లాలో విద్యార్థి విభాగానికి సంబంధించిన యువ నాయకుడికి పాసులు ఇవ్వకుండా పెద్దపల్లి, రామగుండంకు చెందిన ఇద్దరు కీలక నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు రాహుల్ గాంధీ పర్యటన దూరం పెట్టడం పట్ల సదరు విద్యార్థి సంఘానికి చెందిన యువ నాయకుడు పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు తన కంటే కింది స్థాయికి చెందిన వారికి పాసులు ఇచ్చి తనకు ఇవ్వక పోవడం పట్ల సదరు యువ నాయకుడు అసంతృప్తి చెందినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Admin
Aakanksha News