ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కృష్ణ ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. 48 గంటలు గడిచే వరకు ఏం చెప్పలేమని పేర్కొన్నారు. రాత్రి 2 గంటలకు కార్డియాక్ అరెస్ట్ తో కృష్ణ ఆస్పత్రికి వచ్చారన్నారు. 20 నిమిషాల పాటు సీపీఆర్ నిర్వహించినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కృష్ణ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందన్న డాక్టర్లు.. ఆయన శరీరం సహకరిస్తుందా లేదా అనేది ఊహించి చెప్పలేమని స్పష్టం చేశారు. కృష్ణ ఆరోగ్యం మెరుగు పడాలని కోరుకుందామని, మరో 24 గంటల తర్వాత హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వెల్లడించారు.
Admin
Aakanksha News