Saturday, 26 September 2026 07:23:44 AM

చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం

మజ్దూర్ యూనియన్ నాయకులు అంబటి నరేష్

Date : 10 November 2022 02:16 PM Views : 652

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఆర్ ఎఫ్ సీ ఎల్ ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి వస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆర్ ఎఫ్ సీ ఎల్ మజ్దూర్ యూనియన్ పక్షాన అంబటి నరేష్ స్వాగతం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఆర్ ఎఫ్ సీ ఎల్ ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయడం చారిత్రాత్మక కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో Rfcl కార్మికులు అందరు భాగస్వామ్యం కావాలని కోరారు. దేశ రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచి యూరియా ఉత్పత్తిలో Rfcl కార్మికుల పాత్ర కీలకమైనదని కార్మికులకు న్యాయ పరమైన జీత భత్యాలు,అలోవెన్సులు కనీస సదుపాయాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే యూరియాను అతి తక్కువ ధరకే రైతులకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్ము రాకేష్,మర్రి రాము, నేతెట్ల సుధాకర్ ,నాoసాని నాగార్జున, బుర్ర శ్రీకాంత్ ఐత శ్రావణ్ ,మర్రి శ్రావణ్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :