Sunday, 27 September 2026 09:09:51 AM

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను అరెస్టు చేయాలి.

కాంగ్రెస్ పార్టీ కన్నెపల్లి మండల అధ్యక్షుడు ఏల్పుల రోహిత్.

Date : 02 April 2023 10:40 PM Views : 567

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మంచిర్యాల జిల్లా : ఆరిజిన్ డెయిరీ నిర్వాహకురాలు శైలజను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ పార్టీ కన్నెపల్లి మండల అధ్యక్షుడు ఏల్పుల రోహిత్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహిళ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే తన వద్దకు వివిధ పనుల నిమిత్తం వచ్చే మహిళలను లొంగ దీసుకొని లేదా లొంగి పోయేలా చేసి శారీరకంగా వాడుకుంటున్నారని అనేక ఆరోపణలు వచ్చాయన్నారు. దీనిపై మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మహిళకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నుండి ప్రాణహాని ఉన్నదని మహిళా కమిషన్ ఆమెకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.పోలీసులు వెంటనే ఎమ్మెల్యే చిన్నయ్యపై లైంగిక వేధింపులు కింద కేసు నమోదు చేసి దానిపై విచారణ జరిపించాలని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు. మహిళలని గౌరవించని ఎమ్మెల్యేను బిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని, ఎమ్మెల్యేపై సిట్టింగ్ జడ్జితో కానీ సీనియర్ ఐపిఎస్ అధికారితో కానీ విచారణ జరిపించాలన్నారు. అరిజిన్ డైరీ వల్ల మోసపోయిన రైతులకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :