ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గోదావరిఖని పర్యటన నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఓవైపు కేటీఆర్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతుండగానే పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనాన్ని కలిగిస్తుంది.ఎన్నికలవేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. కొంత మంది పార్టీలు వీడి ఇతర పార్టీలోకి వెళ్లడం సంచలనంగా మారుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల కంటే రామగుండం రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ లో వసంతృప్తిగా ఉన్న కొంతమంది నాయకులు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే తన అనుచరులు, సన్నిహితులు ముఖ్య కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయం మేరకు పార్టీకి పదవికి రాజీనామా చేసి రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీంతో సంధ్యారాణి రాజీనామాతో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు చీలే అవకాశం ఉండడంతో పార్టీకి నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇది ఏమైనా రామగుండం రాజకీయాలు రోజుకో విధంగా మలుపు తిరగడంతో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి.
Admin
Aakanksha News