Tuesday, 22 September 2026 10:17:28 AM

నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడ్తా బిడ్డ

ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

Date : 18 November 2022 01:00 PM Views : 575

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడ్తా బిడ్డ అని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... తను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మరోసారి నా గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే సహించేది లేదని ఇన్ని రోజులు సహనంతో ఓపిక పట్టానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. ఎంపీ అరవింద్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడకు వెళ్లి పోటీ చేసి అరవింద్ ను ఒడిస్తానని ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. ప్రాణం పోయే వరకు టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :