Tuesday, 11 August 2026 05:43:42 PM

రామగుండంలో "ఆశయ సాధన యాత్రకు శ్రీకారం"

సంచలనంగా మారుతున్న రాజకీయాలు

Date : 14 July 2023 12:39 PM Views : 1318

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. రోజు రోజుకు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడటంతో నియోజక వర్గంలో ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. అధికార బీఆర్ఎస్ పార్టీకి పోటీగా రామగుండం నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహులు అందరూ ఒక్కతాటిపైకి వచ్చి నియోజకవర్గం మొత్తం "ఆశయ సాధన యాత్ర" పేరుతో ఎన్నికల సమయం వరకు నిరంతర పాదయాత్ర చేయడానికి శ్రీకారం చుట్టారు. మొదటగా రామగుండం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటలకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి 30వ డివిజన్ నుండి ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను 3వ సారి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ఈ పాదయాత్రను చేస్తున్నామని మాజీ మేయర్ కొంక్కటి లక్ష్మీనారాయణ, పాలకుర్తి జెడ్పిటిసి కందుల సంధ్యారాణి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు మిర్యాల రాజిరెడ్డి, ఉద్యమ నాయకులు,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాతిపెల్లి ఎల్లయ్యలు పేర్కొన్నారు. ఈ పాదయాత్ర అనంతరం భారీ బహిరంగ సభను సైతం నిర్వహించనున్నట్లు సమాచారం. దీంతో ఎన్నికల వేళ రామగుండం రాజకీయాల్లో సంచలనం కలిగిస్తున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :