Friday, 25 September 2026 05:18:30 PM

షాట్ ఫైర్ కి ఇచ్చిన డిస్మిస్ ను వెంటనే రద్దుచేయాలి.

సింగరేణి మైనింగ్ స్టాఫ్ పోరాటానికి IFTU మద్దతు.

Date : 17 February 2023 02:41 PM Views : 431

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సింగరేణిలో ఉత్పత్తి ఉత్పాదకత రక్షణ అధికారులకు కార్మికులకు మధ్య వారధిగా పనిచేస్తూ నిత్యం పనిలో గనిలో సమస్యల సుడిగుండంలో నలిగిపోతు మైనింగ్ సిబ్బంది తమ ప్రాణప్రదమైన మైనింగ్ సర్టిఫికెట్ పణంగా పెట్టి అధికారుల ఆదేశాల ప్రకారం సింగరేణిలో మైనింగ్ స్టాఫ్ సోదరులు విధులు నిర్వహిస్తూన్నారని IFTU రాష్ట్ర నాయకులు తోకల రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సింగరేణి యాజమాన్యం ఉన్నత అధికారులు మైనింగ్ స్టాప్ సేవలను వాడుకుంటూ ఎప్పుడు ఎక్కడ ప్రమాదం జరిన ఆ ప్రమాదాలకు కేవలం మైనింగ్ సిబ్బందిని మాత్రమే బాధ్యులను చేస్తూ క్రమశిక్షణా చర్యల పేరుతో ఛార్జిషీట్లు, సస్పెండ్లు,ఇంక్రిమెంట్ల నిలుపుదల, డి ప్రమోషన్స్ చివరకు ఉద్యోగాల నుండి కూడా తొలగింపుకు యాజమాన్యం పూనుకోవటం అత్యంత దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామన్నారు.సింగరణీలో మైనింగ్ స్టాప్ సిబ్బంది రోజు డ్యూటీలో 8 గం లకు మించి పని చేస్తూ తన రిలీవర్స్ కు సేఫ్టీ పై సూచనలు ఇస్తూ తమ శ్రమను, ఎలాంటి అదనపు ఆర్థిక చెల్లింపులకు ఆశించకుండా అధికారులకు యాజమాన్యానికి మైనింగ్ స్టాప్ సేవలందిస్తున్న సంగతి గుర్తించకుండా నేడు జరుగుతున్న ప్రతి ప్రమాదాల్లో మైనింగ్ స్టాప్ ను బాధ్యత చేస్తూ ఉద్యోగాల్లోనుండి తలగింపు వంటి దుర్మార్గమైన పాశవిక చర్యలకు పూనుకోవడం అత్యంత బాధాకరం అని పేర్కొన్నారు. భూపాలపల్లి ocp3 అండర్ గ్రౌండ్ ప్రాజెక్టు లో దురదృష్టవశాత్తు జరిగిన మిస్సైరింగ్ ప్రమాదానికి ముగ్గురు మైనింగ్ స్టాప్ సూపర్ వైజర్లను బాధ్యులుగా చేస్తూ ఆర్థికంగా నష్టం చేయడమే కాకుండా వారి ఆర్థిక హోదాను తగ్గించడం, ఇంటిమెంట్ల కోత విధించారని షాట్ పైరర్ గా పనిచేస్తున్న ప్రకాష్ ని ఏకంగా ఉద్యోగంలో నుంచి డిస్మిస్ చేశారని అన్నారు.సింగరేణిలో ఇప్పటి ఇంత తీవ్రమైన కటిన చర్య ఏనాడు విధించలేదని సింగరేణి సంస్థలో జరిగిన అతి పెద్ద ప్రమాదాల్లో కార్మికుల ప్రాణాలు కోల్పోయారని అయినప్పటికిని సింగరేణి యాజమాన్యం ప్రమాదాలకు బాధ్యులుగా నిర్ధారించిన అధికారులు, సూపర్వైజర్లపై సింగరేణి అధికారుల ఆదేశాలతో మాత్రమే పని చేస్తున్న బాధ్యత గల మైనింగ్ స్టాప్ సూపర్ వైజర్స్ ను మాత్రమే ప్రమాదాలు జరిగినప్పుడు బాధ్యులను చేస్తూ అధికారులు యాజమాన్యం తప్పించుకొనే నెపంతో అధికారులు నిబంధనలు అతిక్రమించారని, విదుల్లో నిర్లక్ష్యం వహించారని, సీఎంఆర్ ను నిర్లక్యం చేశారని ఆరోపించడం తగదని పేర్కొన్నారు.వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకొని మైనింగ్ సిబ్బందిపై విదించిన తీవ్రమైన క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.సింగరేణిలో మైనింగ్ సూపర్ వైజర్స్ కు అధికారుల యాజమాన్యం మద్య సుహృద్భావమైన వాతావరణం నెలకొనే విధంగా ప్రయత్నించాలని అన్నారు. ఏకపక్షంగా క్రమశిక్షణ చర్యల పేరుతో కార్మికుల్లో, కార్మిక కుటుంబాల్లో పారిశ్రామిక అశాంతి నెలకొనే పరిస్థితి యాజమాన్యం తీసుకరావడం సింగరేణి సంస్థకు మంచిది కాదని ఆయన ఒక ప్రకటన లో హెచ్చరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :