Tuesday, 11 August 2026 04:45:48 PM

ఎం.సి.హెచ్ వైద్యురాలు డాక్టర్ ఆర్.శ్రీదేవి సస్పెండ్

జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

Date : 17 June 2023 02:24 PM Views : 704

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : శిశు మృతి చెందిన ఘటనలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఆర్. శ్రీదేవిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే...శ్రీరాంపూర్ మండలం మడిపల్లి గ్రామానికి చెందిన కొప్పుల మమతను తన భర్త నాగరాజు మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి తీసుక వచ్చారు. ఈ క్రమంలో డ్యూటీలో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ కే.రుక్మిణి ఆధ్వర్యంలో గర్భిణీ కొప్పుల మమతకు వైద్య చికిత్సను అందించగా 15వ తేదీన డ్యూటీ డాక్టర్ గా విధులు నిర్వహించిన డాక్టర్ ఆర్.శ్రీదేవి సాయంత్రం కొప్పుల మమతకు ప్రసవం చేయగా అప్పటికే శిశువు మృతి చెందింది. దీంతో ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ఆదేశాల మేరకు డి.సి.హెచ్.ఎస్ ప్రాథమిక నివేదికను సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా విధుల నిర్వహణలో అప్రమత్తంగా లేని డాక్టర్ ఆర్.శ్రీదేవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 14న డ్యూటీ డాక్టర్ గా విధులు నిర్వహించిన డాక్టర్ కె.రుక్మిణి, గైనకాలజిస్ట్ కు సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సూచిస్తూ కలెక్టర్ మెమో జారీ చేశారు. శిశువు మృతి చెందిన సంఘటనపై రామగుండం మెడికల్ కాలేజీలో డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ శిరోమణి, డాక్టర్ భానులతో కూడిన వైద్య బృందాన్ని కలెక్టర్ నియమించి విచారణ చేపట్టి పూర్తి నివేదికను అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :