Thursday, 24 September 2026 04:07:18 PM

సోనియాను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ ది...వి. హనుమంతరావు

Date : 06 October 2022 05:41 PM Views : 552

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని సోనియా గాంధీని మోసం చేసిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్రంలో సంపాదించిన సొమ్మును దేశంలో ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. దేశం కెసిఆర్ ను పిలుస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాటలు ఆస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవ చేశారు. బిజెపికి వ్యతిరేకంగా జాతీయ పార్టీ పెట్టానని చెబుతున్న కెసిఆర్ మాటల్లో నిజం లేదని విమర్శించారు. అంతేకాకుండా ప్రజల సొమ్ముతో విమానాలు కొనుకుంటున్నారని ధ్వజమెత్తారు. బిజెపికి లాభం చేసే అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని పెట్టారని రైతులకు బేడీలు వేసిన చరిత్ర కెసిఆర్ ది అని మండిపడ్డారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :