ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : అసెంబ్లీ సమావేశాల అనంతరం హైదరాబాద్ లో జరిగిన మీటింగ్ అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం సర్వేల ఆధారంగా రామగుండం నియోజకవర్గ టికెట్ ఎవరికీ ఇచ్చిన కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ పార్టీ ఆశావాహులు పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి, మాజీ మేయర్ కొంక్కటి లక్ష్మీనారాయణ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, సీనియర్ నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య, కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ పర్మినెంట్ కార్మిక సంఘం నాయకులు మనోహర్ రెడ్డిలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....కేటీఆర్ మాటకు కట్టుబడి ఉన్నామని, పార్టీ గెలుపు కోసం తప్పనిసరిగా ఎవరికి టికెట్ ఇచ్చిన కృషి చేస్తానని వారు తెలిపారు.అలాగే రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వైఖరిని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుక వెళ్లడానికే మంత్రిని కలవడానికి వెళ్లడం జరిగిందన్నారు.మాతో మాట్లాడటానికి, మమ్మలిని కలవడానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన అనుచరులతో ఫోన్లు చేయించడమే గాక, సుమారు 50 మందితో మా ఇండ్ల వద్దకు వస్తున్నారని ఇంత మందితో ఎందుకు వస్తున్నారని. మేము ఏమి చేశామనే విషయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ కు వివరించమన్నారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వైఖరిని తెలపడానికి వెళ్తే కొందరు కలిసిపోయామని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని చేయడాన్ని వారు ఖండిస్తున్నామని అన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం రామగుండం నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తూ, ఇంచార్జీ కొప్పుల ఈశ్వర్ కి తమ సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామన్నారు.అలాగే గోదావరిఖనిలో ఈ నెల 13వ తేదీన నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంచార్జీ గా బాధ్యతలను మంత్రి కొప్పుల ఈశ్వర్ కి అప్పగించిన సందర్భంగా పురపాలక ఐటి శాఖ మంత్రి,బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కలిసికట్టుగా పని చేస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ కి తెలపడంతో పాటు ఇంచార్జీ గా బాధ్యతలు అప్పగించిన సందర్భంగా తొలిసారిగా గోదావరిఖనికి వస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ కు బసంత్ నగర్ వద్ద ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇదే విషయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుకువెళ్లి చర్చించడం జరిగిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఎవరు నమ్మవద్దని ఈ తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో ఆశావాహులు తేలిపారు
Admin
Aakanksha News