ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / కరీంనగర్ జిల్లా : కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ని అర్ధరాత్రి 12 గంటల తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు... సంజయ్ అత్తమ్మ చనిపోయి బుధవారానికి 9 వ రోజు కావడంతో అక్కడికి చేరుకున్న కొద్దీ సేపటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇంటిని పోలీసులు ఆయన ఇంటికి చేరుకొని అరెస్టు చేశారు. అయితే బండి సంజయ్ ఇంటికి భారీగా పోలిసులు చేరుకోవడంతో అరెస్టు చేస్తారని కార్యకర్తలు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు బండి సంజయ్ ని అదుపులోకి తీసుకునే క్రమంలో కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఆయనను పోలీస్ వాహనంలో ఎక్కించి తీసుక వెళ్లారు. అయితే ఎందుకు అరెస్టు చేశారు.. అనేది తెలియాల్సి ఉంది...
Admin
Aakanksha News