ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో బిసి ల ఓట్లే లక్ష్యంగా నేను బిసినని ప్రచారం చేసుకునే ప్రధాని నరేంద్రబ్ మోడీ, 2018లో పార్లమెంటు సాక్షిగా దేశ జనాభా గణన లో బిసి కులాల గణన చేపడుతామన్న హామీని విస్మరిచారని బీసీ జాగృతి సేన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు బూర్గు గుపల్లి కృష్ణ యాదవ్ అన్నారు.సోమవారం బిసి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో లో కేంద్ర ప్రభుత్వం బిసి బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి,జనవరి నుండి ప్రారంభమయ్యే దేశ జనాభా గణనలో బిసి ల కులాల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఉద్యోగ నియమాకాల్లో క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని, బీసీ అట్రాసిటీ చట్టం ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలని, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి సంకల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ల అమలను దేశవ్యాప్తంగా రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొరిగె మల్లేష్ యాదవ్, నిఖిల్, వెంకట్ రాములు, తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News