ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్యా బృందం ఆస్పత్రిలను సందర్శించి ఎంపికైన ప్రతి ఆసుపత్రికి బహుమతి ప్రధానం చేస్తారు.. ఈ నేపథ్యంలో లక్ష్యా గోదావరిఖని జనరల్ ఆస్పత్రిని సందర్శించగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3వ స్థానాన్ని సాధించింది. ఈ బృందం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యం ఆస్పత్రిలో సౌకర్యాలపై ఈ బృందం సర్వే నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మార్కుల ఆధారంగా ఆస్పత్రిలను ఎంపిక చేస్తుంది. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి పరిశుభ్రతను పాటిస్తున్న ఆసుపత్రులకు ప్రతి సంవత్సరం ఆస్పత్రి అభివృద్ధి కోసం ప్రోత్సాహ బహుమతులను అందజేస్తారు. అయితే లక్ష్య బృందం నిర్వహించిన సర్వేలో గోదావరి ఖని జనరల్ ప్రభుత్వ ఆసుపత్రి 3వ స్థానం సాధించింది.
Admin
Aakanksha News