ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : బీఆర్ఎస్ పార్టీకి. పదవికి పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి మంగళవారం రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామా పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రామగుండం నియోజకవర్గంలో కార్మికులను, రైతులను, వ్యాపారస్తులను అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ రామగుండం ఆడబిడ్డగా తనను ఆదరించాలని కోరుతున్నారు. దీంతో రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీకి మరో ఎదురు దెబ్బ తగలనుంది. ఇప్పటికే నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన కొంత మంది ఆసంతృప్తిగా ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్న నేపథ్యంలో రామగుండం రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో రాజకీయాలు ఏ రోజు ఏ మలుపు తిరుగుతాయో అర్థం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏది ఏమైనా రామగుండం రాజకీయాలు అందరిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి.
Admin
Aakanksha News