Thursday, 24 September 2026 08:52:52 PM

కత్తులతో హాల్ చల్ చేసిన యువకుడి అరెస్టు

Date : 02 February 2023 09:01 PM Views : 702

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : కత్తులతో హాల్ చల్ చేసిన యువకులను అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఒకటవ పట్టణ సీఐ రమేష్ బాబు, ప్రసాద్ రావులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... గత నెల 30వ తేదీన రౌడీ షీటర్ మంథని సుమన్ శవయాత్రలో మారంగుల రమేష్, MD. జాకీర్ అనే ఇద్దరు వ్యక్తులు పొడవాటి కత్తిని తిప్పుతూ రోడ్లపై వెళ్తున్న ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. తల్వార్‌,కత్తులతో వీరంగం సృష్టించిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేయగా A2గా ఉన్న మారంగుల రిమాండ్‌కు తరలించగా పరారీలో ఉన్న జాకీర్ ను గురువారం రిమాండ్ కు తరలించినట్టు గోదావరిఖని 1 టౌన్ సీఐ లు రమేష్ బాబు, ప్రసాద్ రావు లు ఒక ప్రకటన లో తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకపాలకు పాల్పడితే కఠిన చర్యలు చేపడుతామని ఆకతాయిలను హెచ్చరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :