Saturday, 26 September 2026 11:34:43 PM

గవర్నర్లు మారారు తప్ప.. ప్రసంగాలు మారలేదు...

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు

Date : 12 March 2025 04:56 PM Views : 494

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని.. గవర్నర్లు మారడం తప్ప.. ప్రసంగాలు మారలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లుగా అబద్ధాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌తో చెప్పించిందన్నారు. గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఏడాదిన్నర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనమన్నారు. రేవంతు అబద్దాల ప్రచారాన్ని నమ్మించేందుకు గవర్నర్‌ను వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. గవర్నర్ మహాత్మా గాంధీ చెప్పిన మాటలతో 32 పేజీల ప్రసంగం మొదలు పెట్టారని.. ‘నిన్ను నువ్వు కనుగొనడానికి అత్యుత్తమ మార్గం ఇతరుల సేవలో నిమగ్నమవ్వడమే’ అని.. నిజానికి రేవంత్ రెడ్డి అత్యుత్తమ మార్గం ఢిల్లీ, చంద్రబాబు సేవలో నిమగ్నం అయ్యాడని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్నారు. ట్రాన్స్ ఫార్మింగ్ లైవ్స్ అన్నారని.. ఎవరి లైవ్స్ ట్రాన్స్‌ ఫార్మ్‌ చేశారని ప్రశ్నించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :