Friday, 25 September 2026 07:12:20 PM

రూ.లక్ష సాయంపై..గుడ్ న్యూస్

Date : 17 June 2023 08:31 PM Views : 856

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణలో కులవృత్తులు చేసుకునే బీసీలకు ప్రభుత్వం రూ.లక్ష సాయం అందిస్తుంది. అయితే ఈ పథకం ద్వారా కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ సాయం అందనుంది. ఇందులో రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, శాలివాహన, కమ్మరి, మేదరి తదితర కులవృత్తుల వారిని ప్రభుత్వం పేర్కొంది. ఇక ఈ పథకం కోసం కొందరి సభ్యులతో మంత్రివర్గ ఉప సంఘం వేశారు. తాజాగా కేబినెట్ సబ్ కమిటీ పథకం అమలుపై సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్ గుడ్ న్యూస్ చెప్పారు.బీసీలకు రూ.లక్ష సాయం అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని పేర్కొన్నారు.ప్రతీ నెల 5వ తేదీ లోపు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ఆ తరువాత ప్రతీ నెల 15న స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ.లక్ష సాయం అందించనున్నారు. సాయం అందిన వారు నెల రోజుల్లో పనిముట్లు కొనుక్కోవాలని మంత్రి కోరారు. మంత్రి వ్యాఖ్యలు చూస్తే లక్ష సాయం నిరంతర ప్రక్రియగా ఉంటుందనే సందేహాలను లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :