ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆద్వర్యంలో పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి బిజేపి నాయకురాలు కందుల సంధ్యారాణిని ముఖ్య అతిధిగా హాజరై విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గోన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ...గ్రామ ప్రజలందరిపై ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఈ సంధర్బంగా వారు అమ్మవారిని కోరుకున్నారు. కార్యక్రమానికి విచ్చేసిన కందుల దంపతులని ఆలయ కమిటీ సబ్యులు, గ్రామ పెద్దలు పూల మాలలు శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలోఆలయ కమిటి సబ్యులు శ్రీరాముల సత్యం,గట్టయ్య,పొన్నం స్వామి,పొచయ్య,శంకర్,సంపత్,సందీప్,రాజు,అజీత్,సాయికుమార్,రాము,సతీష్ తదితరులు పాల్గోన్నారు.
Admin
Aakanksha News