Friday, 25 September 2026 10:18:12 PM

సీజన్ లో వచ్చే నాయకులే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

Date : 18 April 2023 11:59 AM Views : 988

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సీజన్ లో వచ్చే నాయకులే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు అని రామగుండం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...తెలంగాణలో అభివృద్ధిని చూసి ఓర్వలేకనే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గాల్లో డిపాజిట్ ను దక్కించుకోవడానికే ఈ పాదయాత్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయంలో ఎంతో అనుభవం కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టి విక్రమార్కకు రామగుండం అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చంపినోల్లే సంతాప సభలు పెట్టినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి తయారైందని విమర్శించారు. శ్రీపాద ప్రాజెక్టు ఓపెన్ చేసిన తర్వాత మంథనికి నీళ్లు తరలించకపోయిన చరిత్ర ఎవరిదని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రతి ఎకరానికి నీళ్లు అందించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఈ ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలు వస్తున్నాయని పాదయాత్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే అభివృద్ధి మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :