Sunday, 26 July 2026 05:30:23 AM

తెలంగాణలో గుండారాజ్యం...

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిని ఖండించిన కేటీఆర్...

Date : 11 January 2025 06:27 PM Views : 733

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / యాదాద్రి భువనగిరి జిల్లా : తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ గుండాల రాజ్యం నడుస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ అనుబంధ NSUI నాయకులు దాడికి తీవ్రంగా ఖండించారు.ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండారాజ్యం చలాయిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అన్నారు. ఎన్నుకున్న ప్రజలతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై, నాయకులపై, పార్టీ కార్యాలయాల పైన దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈరోజు అరాచకాలకు చిరునామాగా మారిందని, దాడులు, గుండాగిరి తమ మార్కు పాలన అని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుంటోందన్నారు. మా పార్టీ కార్యకర్తల, నాయకుల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాం అని...వెంటనే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలతో పాటు, వారి వెనుక ఉన్న జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :